Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సీఎం రేవంత్‌రెడ్డి ఆఫర్‌ను తోసిపుచ్చిన మాజీ డీఎస్పీ నళిని

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ముఖ్యకార్యదర్శి ఎ.శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు.  ఆమెకు తిరిగి పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అవరోధాలు ఉంటే వేరే శాఖలో అదే హోదా కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. నళినికి న్యాయం జరగలేదని, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు ఇచ్చినప్పుడు.. నళినికి ఎందుకు అన్యాయం జరగాలని రేవంత్‌ ప్రశ్నించారు. నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్న ప్రభుత్వం ఆలోచనను  ఓ న్యూస్‌ చానల్ ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తానిప్పుడు సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you