తెలంగాణవీణ, హైదరాబాద్ : మాజీ డిఎస్ పి నళిని ఆద్యాత్మికం బాటలో వెళ్లాలని నిర్యాయించికొని, తానిప్పుడు ధర్మ ప్రచారంలో ఉన్నానని, అందువల్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆఫర్ చేస్తున్న ఉద్యోగాన్నీతీసుకోదలచుకోలేదని మాజీ డిఎస్ పి దోమకొంవ నళిని లేఖ రాశారు.తనకు న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని ఆయన లేఖ లో పేర్కొన్నారు.”ఎందుకంటే మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను,” అని ఆమె లేఖలో పేర్కొన్నారు.ఉద్యోగం మానేసిన తర్వాత తాను అన్ని విధాల బహిష్కరణకు గురయ్యానని, అలాంటపుడు ఒక స్వామీజీ తనకు చేరువ అయి జీవిత గమ్యం మార్చారని ఆమె చెప్పారు.