- సంఘం అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- సందడిగా రెడ్డి కుల సంఘం వనభోజనాల కార్యక్రమం
తెలంగాణ వీణ , కొత్తగూడెం : రెడ్డి కుల సంఘం అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని తోగ్గుడెంలోని సమ్మక్క- సారక్క ఆలయం వద్ద రెడ్డి కుల సంఘం వారు ఏర్పాటు చేసుకున్న 14వ వనభోజనాల కార్యక్రమంలో పాయం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి కుల సంఘం అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించి కుల సంఘం అభివృద్ధికి తోడ్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కుల సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ముఖ్యఅతిధిగా విచ్చేసిన పాయంకు రెడ్డి కుల సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.