తెలంగాణ వీణ , హైదరాబాద్ : మరొక్క రోజులో క్యాలెండర్ మారిపోతుంది. 2023కు ముగింపు పలికి కొత్త ఏడాది 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నూతన ఏడాదిలో తొలి చంద్రగ్రహణం మార్చి 25న(సోమవారం) ఏర్పడనుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. చంద్రగ్రహణం ఉదయం 10.41 గంటలకు మొదలై మధ్యాహ్నం 3.01 గంటలకు ముగుస్తుంది. దాదాపు 4 గంటల పాటు కొనసాగనుంది. అదే రోజు హోళీ పండుగ వచ్చింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇతర అనేక ప్రాంతాల్లో కనువిందు చేయనుంది.