తెలంగాణ వీణ , క్రీడలు : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. మహేంద్రసింగ్ ధోని వాడిన 7వ నెంబర్ జెర్సీని ఇకనుంచి ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా ఆ నంబర్ జెర్సీను రిటైర్ చేయనుంది. భారత క్రికెట్ కు మిస్టర్ కూల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డ్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల కోసం 60 రకాల బేసి సంఖ్యలను కేటాయించామని తెలిపారు. గతంలో కూడా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వాడిన 10వ నంబర్ జెర్సీ ని కూడా ఇలానే రిటైర్ చేసిన విషయం తెలిసిందే.