తెలంగాణవీణ, కాప్రా : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు వద్ధ భక్తుల పొటెత్తారు. శనివారం ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేఅభ్యర్థి, పార్టీ సీనియర్ నాయకుడు మందముల పరమేశ్వర్ రెడ్డి కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం లో ప్రత్యేక పూజలు చేశారు. చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసుల పోచయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి గరుడ వాహనం పై కొలువుదీరిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది పరమేశ్వర్ రెడ్డికి స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు, అనంతరం తీర్థం, ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వైకుంఠ వాసుని కృపా కటాక్షాలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు. కరోనా లాంటి మహమ్మారి ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంకూరి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి, పెద్ది నాగరాజు గుప్తా, తాళ్ల వెంకటేష్ గౌడ్, కొత్త అంజిరెడ్డి, గడ్డం యాదగిరి, సీనియర్ నాయకులు పెద్ది శ్రీనివాస్ గుప్తా, కాసుల సురేష్ గౌడ్, అల్లాదుర్గం శ్రీనివాస్, అమరాచారి, సింగిరెడ్డి వెంకట్రెడ్డి, పంజాల సంజయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మౌలాలీ హెచ్ బీకాలనీలో…
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా హోసింగ్ బోర్డు డివిజన్ మంగాపురం కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్థానిక కాంగ్రెస్డ్ నాయకులు జల్గం వెంకటేష్ , పోలపాక అంజయ్య , శ్రీనివాస్ ముదిరాజ్ , పోలేగౌని శ్రవణ్ కుమార్ గౌడ్, వెంకట్, ట్రిపతి సురేష్, మల్లికార్జున్ నవీన్ లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.