తెలంగాణ వీణ , ములుగు : క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ములుగు
తాడ్వాయి మండలం లోని నార్లపూర్ గ్రామం ,ఏటూరు నాగారం మండల కేంద్రము లో మరియు చిన్నబోయిన పల్లి గ్రామములో మంగపేట మండలం లోని కమల పూర్ గ్రామాలలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మతసామరస్యాన్ని కాపాడుతుందని
క్రైస్తవ సమాజం విద్య, వైద్య రంగాల్లో చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు రక్షణ కల్పిస్తుందని, ప్రజల మధ్య శాంతి, ఐక్యత నెలకొనాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు రాష్ట్ర,జిల్లా,బ్లాక్ మండల అధ్యక్షులు,అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.