తెలంగాణ వీణ , హైదరాబాద్ : సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు రూ. 20 నుంచి రూ. 25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా, ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మంతనాలు జరిపినట్టు అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా, కేసు నుంచి నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నం చేసిన పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.