తెలంగాణవీణ, కాప్రా : కాప్రా సర్కిల్ పరిధిలో సర్వే నెంబరు 177 లోని సమస్యను పరిష్కరించాలంటూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఇరువైఎళ్ల కిందట సర్వే నెంబరు 177లొని సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన లేవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేశామని, అయితే కొందరు 199/1 సర్వే నెంబరు సరిహద్ధులు వ్యవహారంలో భూ వివాదాన్ని సృష్టిస్తూ తమ కాలనీ అభివద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అసైన్డు భూములను అమ్ముకుంటూ కమర్షియల్ షెడ్డును ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తూ తమ కాలనీవాసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో తప్పుడు సర్వే రిపోర్టుతో అధికారులను, కాలనీసంక్షేమ సంఘాల ప్రతినిధులను భయాందోళనకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారాని ఆరొపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేకూర్చాలని ఆందోళన చేపట్టారు. కొందరు భూకబ్జాదారులు భూవివాధాలను సృష్టిస్తూ ఏలాంటి ఆదారాలు లేకుండా బెదిరింపులకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. జీహెచ్ఏంసీ, రెవిన్యూ, అధికారులను తప్పతొవ పట్టిస్తూ కాలనీలో అనుమతులు, రిజిస్టేషన్లు అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాలనీలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ ఆదాయానికి బారీగా గండిపడుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నిలిపి వేయడానికి సరైన కారణం చెప్పకుండా అధికారులు పోంతన లేని సమాదానాలుచెబుతున్నారని కాలనీవాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో చర్లపల్లి డివిజన్ సర్వే నంబర్ 177లో శ్రీసాయికృష్ణానగర్ కాలనీ ఏర్పడిందనీ . 211 ప్లాట్లతో ఏర్పడిన ఈ కాలనీలో కొంత కాలం పాటుగా రిజిస్ట్రేషన్లు సజావుగానే సాగాయన్నారు. అయితే పట్టా స్థలాల్లో రిజిస్టేన్లను నిలిపివేసిన అధికారులు అటూ సర్వే నెంబరు 199/1లోని ప్రభుత్వ స్థలాన్ని అక్రమించుకుని గదుల నిర్మాణాలు, బారీ షెడ్లను నిర్మించి విక్రయాలు చేపడుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.