Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మానవ అక్రమ రవాణా కేసులు..టాప్‌లో తెలంగాణ!

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది. 
ఎన్సీబీ నివేదికలోని ముఖ్యాంశాలు..

  • గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా 391 కేసులు తెలంగాణలో వెలుగు చూశాయి. 
  • ఈ కేసుల్లో 25 మంది బాలికలు, 9 మంది మంది బంగ్లాదేశ్ యువతులు, 641 మంది మహిళలు, 38 మంది బాలురుతో సహా మొత్తం 704 మందిని రాష్ట్ర పోలీసులు కాపాడారు.
  • బాధితుల్లో కొందరిని రెస్క్యూ హోమ్స్‌కు బాలకార్మికులను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మరికొందరిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. 
  • 600 మందికి పైగా మహిళలు, 100 మంది చిన్నారులకు మెట్రో నగరాలకు అక్రమంగా తరలించినట్టు ఎన్సీబీ నివేదిక చెబుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పాటూ ఇతర రాష్ట్రాల యువతులు, మైనర్లును అక్రమంగా రవాణా చేస్తున్నారు. 
  • తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాలు క్రియాశీలకంగా ఉండటంతో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది.
  • ఉద్యోగం, ఉపాధి, ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తెలంగాణకు రప్పిస్తున్నారు. చివరకు వ్యబిచార కూపాల్లో దించుతున్నారు.
  • బీహార్, యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాలకార్మికుల అక్రమ రవాణా సాగుతోంది. 
  • రాష్ట్రంలో మానవ అక్రమరవాణాకు చెక్ పెట్టేందుకు 30 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. 
  • కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారం సీఐడీ పోలీసులు, స్వచ్చంధ సంస్థలు, చైల్డ్ ప్రొటెక్షన్, లోకల్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో పోదారుల నిర్వహిస్తున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you