తెలంగాణ వీణ , హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని లాస్య నందిత విజయం సాధించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి శ్రీ గణేశ్ రెండో స్థానంలో ఉండగా, వెన్నెల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. లాస్య నందిత 17,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత విజయం
