తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అనేక చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగే కొద్దీ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి భారీ ఆధిక్యం పొందడంతో బాల్క సుమన్ ఇక పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు. కౌంటింగ్ ఆరంభం నుంచి వివేక్ దూకుడు ప్రదర్శించారు. ఐదు రౌండ్ల అనంతరం ఆయన ఆధిక్యం 12 వేలకు పైనే ఉంది. వివేక్ కు 26,122 ఓట్లు లభించగా, బాల్క సుమన్ కు 14,083 ఓట్లు మాత్రమే వచ్చాయి.