తెలంగాణ వీణ , జనరల్ : ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా అనేది వైరల్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. పదేళ్ల చిన్నారి నుంచి పండు ముసలివారి వరకు ఆల్ మోస్ట్ అందరికీ సోషల్ మీడియాలో అకౌంట్ ఉండడం సర్వసాధారణమై పోయింది. ఈ క్రమంలో కొంతమంది ఈ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోతున్న సంగతి తెలిసిందే. రోజులో ఎన్నో గంటల పాటు ఈ ప్రపంచంలో గడపడమే ప్రపంచంగా బ్రతుకుతున్నవారూ పెరిగిపోతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా యూజర్ల విషయంలో మానసిక నిపుణులు కీలక విషయాలు చెబుతున్నారు. సోషల్ మీడియా వల్ల పలు దుష్ప్రభావాలు ఉన్నాయని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా… సోషల్ మీడియాలో చేసే పోస్టులను అదేపనిగా చూడడం వల్ల ఆత్మన్యూనత, అభద్రత భావం వంటి మానసిక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో… సోషల్ మీడియాలో ఉండేదంతా నిజమేనన్న భావనలో కొంతమంది తమను తాము తక్కువ చేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.