తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీలో రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల టీడీఆర్ స్కామ్‌ను తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ముఖ్య నగరాల్లో రూ. వేలకోట్ల వైఎస్ టీడీఆర్ స్కామ్ జరిగిందని, రూ.45వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఒక్క తిరుపతిలోనే రూ.4వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. భూమా కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు భూమా అవినయ్ రెడ్డి సూత్రధారులని అన్నారు. తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను మంజూరు చేశారని, ఇందుకుగాను 2,85,406 స్వ్కేర్ ఫీట్ స్థలాలని సేకరించారన్నారు. వ్యవసాయ, రెసిడెన్షియల్ విలువకంటే… కమర్షియల్ స్థలాల విలువ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని, అయితే వ్యవసాయ భూములను కమర్షియల్‌గా చూపి దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ ఎన్నిసార్లు ఆర్టీఏ కింద సమాచారం కోరినా ఇవ్వలేదని, సమాచారం ఇవ్వకున్నా… తెచ్చుకోగలమని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు