- సబ్బండ వర్గాలలకు దిక్సూచి సిపిఐ జెండా
- చరిత్రగతిని మార్చే శక్తి ఎర్రజెండాకే ఉంది
- సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా
- శేషగిరిభవన్లో ఘనంగా సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
తెలంగాణ వీణ , కొత్తగూడెం : గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిస్తేనే సింగరేణి సంస్థకు కార్మిక వర్గానికి మనుగడ ఉంటుందని సిపిఐ భద్రాది కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా పునరుద్ఘాటించారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం 99వ వ్యవస్థాపక దినోత్సవ కేక్ కట్ చేసిన అనంతరం జరిగిన సదస్సులో సాబీర్ మాట్లాడారు. ఇటీవల సర్కారు సంఘం పాలన ఫైరవీలతోనే సాగిందని కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని అన్నారు. కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెట్టడమే సర్కారు సంఘాలు పనిగా పెట్టుకుంటాయని ఇలాంటి సంఘాలు సంస్థకు, కార్మికుల మనుగడకు ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో కార్మికుల పక్షం వహించే ఏఐటీయూసీని గెలిపించాలని కోరారు. సబ్బండ వర్గాలకు సిపిఐ జెండా దిక్చూచి అని సుధీర్గపోరాట చరిత్రలో ప్రజలకు కార్మికులకు కర్షలకులకు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే తత్వాన్ని నేర్పింది కమ్యూనిస్టు పార్టీ జెండానేనని మనిషిని మనిషి దోపిడి చేయని సమసమాజ నిర్మాణంకోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటివరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని అన్నారు. కార్మిక కర్షక ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టుల సొంతమని పేర్కొన్నారు. పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు. చరిత్రగతిని మార్చే శక్తి కేవలం ఎర్రజెండాకే ఉందని నాటి అమరవీరుల స్పూర్తితో ఉద్యమాల ఉదృతిని పెంచుతామని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకులు మతోన్మాదాన్ని పెంచొపోషిస్తున్నాయని దేశసంపదను కొల్లగొడుతూ కార్పోరేట్లకు కట్టబెడుతూ దేశాన్ని తిరోగమనంపైపు నెట్టివస్తున్నారని ఈ పరిస్థితిలో ఈ శక్తుల నుండి దేశాన్ని కాపాడుకునే భాద్యతను కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి జిల్లా నాయకులు బందెల నర్సయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, వంగా వెంకట్, భూక్య శ్రీనివాస్, ఎ.కె.ఫహీమ్,
కె.రత్నకుమారి, రమణమూర్తి, కిష్టోఫర్, సుధాకర్రెడ్డి, నూనావత్ గోవిందు, గుత్తుల శ్రీనివాస్, యు.హరీష్, ఖయ్యూమ్, జహీర్, భూపేష్, ఎం.సత్యనారాయణ, ధనలక్ష్మి, మిర్యాల రాము తదితరులు పాల్గొన్నారు.