తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి… అప్పుడే తన మార్క్ ఏమిటో చూపిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతి భవన్)లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. ప్రజాదర్బార్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే మీడియాతో రేవంత్ మాట్లాడుతూ… ప్రగతిభవన్ ను, సచివాలయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ప్రగతిభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తెలిపారు. చెప్పిన విధంగానే ఆయన ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు.