తెలంగాణ వీణ , సిద్దిపేట : సిద్దిపేట్ జిల్లా చేర్యాల డిసెంబర్ గుర్జ కుంట వాగు సమీపం లో ఉన్న హెచ్ పి. పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వచ్చి ఓ కారు చెడిపోయిన సంఘటన చేర్యాల పట్టణంలో కలకలం రేపింది. బాధితుడు లింగం మరియు చిట్యాల గ్రామనికి చెందినా వంకాయల బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్జకుంట వాగు వద్ద ఉన్న సాయి కృప ఫిల్లింగ్ స్టేషన్ హెచ్ పీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకున్న అనంతరం కారు స్టార్ట్ కాకపోవడంతో కారు యజమాని మిత్రులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆ పెట్రోల్ బంకులో 500 రూపాయల తో కారులో పెట్రోల్ పోశాడు. కారు స్టార్ట్ కాక సతాయించడంతో పట్టణంలోని ఓ మెకానిక్ ను పిలిపించి ఆ కారును మెకానిక్ షెడ్డుకు తరలించి కల్తీ పెట్రోల్ ను తీయించి వేరే పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ తెప్పించుకుని చూడగా తేడా ఉన్నట్లు తేలడంతో దీంతో బాధితుడు తన మిత్రులతో కలిసి పెట్రోల్ పంపు వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. సిబ్బంది తమకు సంబంధం లేదంటూ దాటవేశారు. కల్తీ పెట్రోల్ వల్ల తమ వాహనాలు చెడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వెంటనే బంక్ ను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు