- గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ
- చిన్నారులకు స్నాక్స్ అందజేసిన ఫౌండేషన్ టీం
తెలంగాణ వీణ, కొత్తగూడెం : సేవకు చిరునామాగా అమృత హాస్పిటల్ నిలిచింది. చలికాలం దృష్ట్యా దీనిని గుర్తించి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో వారు చలిని తట్టుకొని ఉండేందుకు అందుకు కావలసిన దుప్పట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానాంబైలు గ్రామ పంచాయతీ పరిధిలోని సరేకళ్ళు అనే గిరిజన గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలకు మంగళవారం దుప్పట్లు పిల్లలకు స్నాక్స్ అందించడం జరిగింది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో అడవిలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు చలి తీవ్రతతో ఇబ్బందులుపడుతున్నారని తెలుసుకున్న హ్యాపీ టూ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు అండ్ కొత్తగూడెంలో ఉన్న అమృత హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బాబురావు, డాక్టర్ జయ సహాయసహకరలతో ఆ గిరిజన గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలకు దుప్పట్లు పిల్లలకు స్నాక్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జయ ఫౌండేషన్ సభ్యులు లేంటిల్, గంగా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.