- బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ యెర్రా కామేష్
తెలంగాణ వీణ, కొత్తగూడెం : నియోజకవర్గంలో ఆధార్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డులో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించుకోవాలంటే ఆధార్ సెంటర్లు తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయాలన్నా సరే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ సంవత్సరం తదిత వివరాలు పొందుపరచాలన్న చాలా సమయం పడుతుందని మీ సేవ కేంద్రాలో రోజుకు నలభై మందికి మిగత కేంద్రల్లో కేవలం ముపై మందికి మాత్రమే టోకెన్లు జారీ చేయడంతో జిల్లా కేంద్రంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు చలిలో వచ్చి ఆధార్ కేంద్రాల వద్ద అర్థరాత్రి నుండే క్యూలైన్ లో పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో చాలా సమస్యలపై ప్రజలు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ఆధార్ సంబంధిత సమస్యలపై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామవరం, రుద్రంపుర్, సుజాతనగర్, చుంచూపల్లి, నవభారత్, పాల్వంచ, పెద్దమ్మతల్లి దేవాలయం తదితర ప్రాంతల్లో కొత్తగా ఆధార్ కేంద్రాలను మంజూరు చేయాలని అదేవిధంగా ఉన్న ఆధార్ కేంద్రాల్లో కౌంటర్లు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కొరకు ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నా నియోజకవర్గంలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహదారు గంధం మల్లికార్జున్ రావు, చేనిగారాపు నిరంజన్ కుమార్, నాగుల రవికుమార్, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.