తెలంగాణ వీణ , రాష్ట్రీయం : తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ, అంచెలంచలుగా ఎదిగి, ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అచ్చెన్న కొనియాడాడు. రేవంత్ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని ఎదురుదెబ్బలు తిన్నారని గెలుపు ఓటములను ఎదుర్కొన్నారని చెప్పారు రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆశిస్తున్నానని చెప్పారు.