Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 పొటాటో అంటే ఉల్లిగడ్డనే కదా!

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తిరుపతి జిల్లాలో మిగ్ జాం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా వాకాడు మండలం బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసిన ఓ వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఆయన మాట్లాడుతూ… పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అంటూ తడబడ్డారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

జగన్ మాట్లాడుతూ… తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8 వేలకు పైగా బాధితులను అక్కడకు తరలించామన్నారు. దాదాపు 60వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పొటాటోను ఉల్లిగడ్డ అనే అంటారు కదా? అని పక్కనున్న వారిని అడిగారు. పొటాటో అంటే ఆలుగడ్డ…. కానీ ఆయన ఉల్లిగడ్డ అంటారు కదా.. అని ప్రశ్నించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you