తెలంగాణ వీణ , సినిమా : దళపతి విజయ్ సరసన ‘మాస్టర్’ మూవీ తో హీరోయిన్ గా లైమ్ లైట్లోకి వచ్చిన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రెజెంట్ హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ మెల్లమెల్లగా పాపులారిటీ పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమధ్య అందాల ఆరబోతలో అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకునేలా గ్లామర్ ని ఒలకబోస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో మరోసారి అదిరిపోయే అవుట్ ఫిట్ తో దర్శనమిచ్చింది.