తెలంగాణ వీణ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ క్యాంపస్‌లో నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కలకలం రేపారు. అర్ధరాత్రి క్యాంపస్ గేటును కారుతో ఢీకొట్టారు. ఆ తరువాత క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లి తమకు అడ్డువచ్చిన విద్యార్థులతో గొడవపడ్డారు. కొందరు విద్యార్థులను తమ కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు.