ములుగు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేసిన ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్….
తెలంగాణ వీణ, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద, గోవిందరావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా మరియు పాలడుగు వెంకటకృష్ణ గార్ల ఆధ్వర్యంలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి ఇందిరమ్మ విగ్రహానికి పూలదండ వేసి కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేశారు.
ఈ సందర్భంగా 139 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఈ రోజు సరిపోదు అని, ముఖ్యంగా 1884 లో ఒక బ్రిటిషర్ అయిన అలన్ ఆక్టావియాన్ హ్యూమ్ అనే వ్యక్తి దేశ ప్రయోజనాల కోసం ఇండియన్ నేషనల్ యూనియన్ గా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ 139 యేండ్ల నుండి భారత దేశం మీద ఇంత ప్రభావం చూపుతుంది అని ఎవరు అనుకోలేదు, ఇండియన్స్ అందరిని ఒక తాటి మీదకి తెచ్చి స్వాతంత్రం తెచ్చుకోవాలనే కాంక్షతో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28 న దాదాబాయి నౌరోజీ చేతులమీదుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా పేరు మార్చడం జరిగింది. అసలు ఏక ఛత్రాధిపత్యం వహించిన ఏకైక పార్టీ, స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిషర్ ల దగ్గరి నుండి స్వాతంత్య్రం తీసుకు రావడానికి సరైన వేదిక లేక దిక్కు తోచని స్థితిలో ఆ సేతు హిమాచలాన్ని సైతం ఒక తాటి మీదకి తెచ్చి భారతీయుడి నర, నరాన ఉద్యమ స్ఫూర్తి తీసుకు వచ్చిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, వందల సంవత్సరాల బానిస సంకెళ్లను తెంపి, ఓ మహోజ్వల ఘట్టానికి తెరలేపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఆరు దశకాల పాటు పోరాటం సాగించి భారత మాత నుదిటి మీద స్వాతంత్ర తిలకం దిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వాతంత్రం సిద్దించాక ఏడు దశాబ్దాలు నవ భారతానికి అడుగులు వేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలా ఆవిర్భావం నుండి భారత దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, వందేమాతరం ఉద్యమం,సహాయ నిరాకరణ ఉద్యమాలతో బ్రిటిషర్స్ పై ఒత్తిడి తెచ్చి 1947 లో స్వరాజ్యాన్ని సాధించి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గోపాల కృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్ లతో రెండు బాగాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ 1919 లో మహాత్ముడి రాకతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక అందరిని ఒక తాటి మీదకి తెచ్చిన ఘనత మహాత్ముడికే చెందుతుంది. స్వాతంత్ర అనంతరం కూడా ఏడు దశాబ్దాలు నవ భారతాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మహానీయులను మనకు అందించింది. అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశ చరిత్ర లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే రాజకీయమే లేదు అని కాంగ్రెస్ పార్టీని కొనియాడారు. అసలు భారత దేశ మహోజ్వల భవిష్యత్ కి బాటలు వేసింది.
కాంగ్రెస్ పార్టీ నుండి తొలి ప్రధానిగా హస్తినలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన జవహర్ లాల్ నెహ్రు తను కళలు కన్నా భారతావని నిర్మించడంలో సఫలమై భారత దేశ రాజకీయ చరిత్రను నెలకొల్పిన మహా ఘనుడు అని, ఇతను దేశానికి పంచ వర్ష ప్రణాళికలు, ఆనకట్టల నిర్మాణానికి పునాదులు వేసి దేశ భవిష్యత్ ని మరో అడుగు ముందుకు వేయించి ప్రపంచ శాంతికి కూడా బాటలు వేసాడు. 1947 లో దేశ విభజన, కాశ్మీర్ యుద్ధం, 1962 లో చైనా యుద్ధం నెహ్రు ధృడ సంకల్పాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయాయి. 17 ఏండ్లు పాలించిన నెహ్రూ అభినవ భారతాన్ని నిర్మించడంలో జాతికే మార్గదర్శకుడు అయ్యాడు అని కితాబిచ్చారు. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నేను ఉండి ప్రజా సేవ చేస్తున్నందుకు నాకు చాలా గర్వాంగా ఉన్నది అని అన్నారు. అలాగే ఎంతో మంది మహా, మహులు ఉన్న పార్టీలో నేను కూడా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్న అని కాంగ్రెస్ పార్టీ ని కొనియాడారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం చేపట్టి దేశానికి వెన్నుముక అయిన రైతన్నకు అండగా నిలబడి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం ఆరు గ్యారంటీల ఫైల్ పైన పెట్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని మరోసారి నిరూపించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం 10 లక్షలకు పెంచగా, నేడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా మహాలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి మహిళకు 2500/- రూపాయలు, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, చేయూత పథకం ద్వారా వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్ అందించడానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.