తెలంగాణ వీణ , రాష్ట్రీయం : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గోలిపల్లి రాజశేఖర్ రెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించాడు. పార్టీ లో కీలకంగా పని చేసిన తనకు ప్రస్తుతం తగిన గుర్తింపు లేకపోవడం కారణంగానే పార్టీ మనుగడ చేయలేనంటున్నాడు. భవిష్యత్ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఇదేమైనా పార్టీ లో కీలకంగా పని చేసిన యూత్ అధ్యక్షుడు ఎన్నికల సమయంలో పార్టీని వీడడం పెద్ద దెబ్బనని చెప్పవచ్చు.