తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాష్ట్రంలో వైసీపీ పార్టీ పని అయిపోయిందని.. 5 కోట్ల ప్రజలు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఓటర్ లిస్ట్ అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమ, తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం జగన్ , వైసీపీ పార్టీ నేతలు చివరకు ఓటర్ లిస్ట్‌లపై పడ్డారు. దొంగ ఓట్లు చేర్చడానికి వలంటీర్, సెక్రటేరియట్ వ్యవస్థను తయారు చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్ లిస్ట్‌లను మాయం చేస్తున్నారు. బోండా ఉమ నియోజకవర్గంలో చెట్టును కూడా ఓటర్ లిస్ట్‌లో చేర్చారు. ఒక్కొక్క చోట మూడు ఓట్లు నమోదు చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి మూడు చోట్ల ఓట్లు ఏర్పాటు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్‌లకు లేఖలు రాసినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్‌లు తీసుకున్నారు. తాజాగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో ఈ మూడు అంశాలను పట్టించుకోలేదు’’ అని ఆరోపించారు.