Friday, December 27, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్

Must read

తెలంగాణ వీణ , సిటీ బ్యూరో : తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు కూడా తెరుచుకోవు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ నెలాఖరున వరుసగా మూడు రోజులు మద్యం అమ్మకాలు బంద్ పెట్టనున్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచనలు చేసింది.

ఈ నెల 28 నుంచి 30 వరకు వైన్స్ బంద్ పెట్టాలని, ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించింది. సీఈసీ ఆదేశాల మేరకు ఈ నెలాఖరున మద్యం విక్రయాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వైన్ షాపుల యజమానులు, బార్ల యజమానులను అలర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you