తెలంగాణ వీణ, గజ్వెల్ : మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ఎంపీపీ పాండు గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని పాములపర్తి గ్రామంలో పెద్ద ఎత్తున బోనాలతో డప్పుల దరువులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విచేసేసారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు హ్యాట్రిక్ ఖాయమని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షతులై బిఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. కెసిఆర్ నేతృత్వంలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి భ్రహ్మారథం పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ ని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి యాదవ్ రెడ్డి హరిపంతులు,తాడూరి స్వామి గౌడ్,పిట్ల సత్యనారాయణ,కనకయ్య,నరేందర్ రెడ్డి,బోయిని మురళీకృష్ణ బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.