తెలంగాణ వీణ , మీర్ పెట్: మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్, మంగాపురం కాలనీ, శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ వారు, బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే తమ సామాజిక వర్గానికి మంచి జరుగుతుందనే నమ్మకంతో, వ్యక్తిగతంగా అందరికీ సుపరిచితుడైన బిఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి నిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ, పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి కలిగిన బండారి లక్ష్మారెడ్డి లాంటి నాయకుడు ఉప్పల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో, ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని, తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నేథ్యంలోనే తమ విశ్వకర్మ టెంపుల్ సంఘ కార్యాలయ నిర్మాణానికి కొంత స్థలం కేటాయించి, నిర్మాణం చేపట్టాల్సిందిగా బండారి లక్ష్మారెడ్డి ని కోరడంతో, రేపు ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలిచిన వెంటనే, మీరు కోరిన విధంగానే అర్హులైన వారందరికీ బీసీబంధు లక్ష రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని, అలాగే సంఘ భవన నిర్మాణం చేపడతామని, బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు