తెలంగాణ వీణ , సినిమా: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ కష్టాల్లో ఉన్న వారికి సాయంగా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన ఒక పాప ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. తన అభిమాన సంఘాల ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ… ఆ చిన్నారికి లక్ష రూపాయల చెక్ పంపించారు. ఈ చెక్ ను ఆ పాపకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అందించారు. ఈ సందర్భంగా విజయ్ ను ప్రశంసించారు. దైవం మనుష్య రూపేనా అనే వాక్యానికి అర్థంగా నిలుస్తూ విజయ్ దేవరకొండ చేసిన సాయం ఆయన సహృదయానికి నిదర్శనమని చెప్పారు.