తెలంగాణ వీణ , సినిమా : ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శనివారం ఉదయం ఈ కొత్త జంట శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. భర్తతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ లావణ్య ఎయిర్ పోర్ట్ లో సందడి చేసింది. ఈ నెల 1న ఇటలీలోని టస్కానీలో లావణ్య, వరుణ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీతో పాటు సమీప బంధుమిత్రులు, టాలివుడ్ హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. ఈ నెల 5న హైదరాబాద్ లో లావణ్య, వరుణ్ ల పెళ్లి రిసెప్షన్ జరగనుంది.
దీంతో ఇటలీ నుంచి శనివారం ఉదయం ఈ నవదంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఈ జంటను తమ కెమరాల్లో బంధించేందుకు జర్నలిస్టులు పోటీపడ్డారు.