‘
తెలంగాణ వీణ , సినిమా : టాలీవుడ్ క్రేజీ కపుల్ వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి నేడు వివాహం బంధంలోకి అడుగుపెట్టనున్నారు. పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే మెగా, లావణ్య కుటుంబాలు, టాలీవుడ్ ప్రముఖులు ఇటలీ సియెనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్‌కు చేరుకున్నారు. వివాహ వేడుకలో భాగంగా నిన్న సోమవారం కాక్‌టెయిల్ పార్టీ జరగ్గా, నిన్న హల్దీ ఫంక్షన్ జరిగింది. వధూవరులిద్దరూ పసుపు దుస్తుల్లో మెరిసిపోయారు.లావణ్య పసుపు వర్ణం లెహంగా ధరించగా, వరుణ్‌తేజ్ అదే రంగు కుర్తా, తెలుపు రంగు పాటియాలా ప్యాంట్ ధరించాడు. ఈ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ వేడుక థీమ్‌ను కూడా పసుపు, తెలుపు రంగుల్లో డిజైన్ చేయడంతో అక్కడి వాతావరణం పసుపు వర్ణంతో శోభాయమానంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.