తెలంగాణ వీణ,కాప్రా: దేశానికి, రాష్ట్రానికి హానికరమైన బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని, ఉప్పల్ నియోజకవర్గంలో సీపీఐ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్. బోస్ పిలుపునిచ్చారు, కాప్రా లోని జీఆర్ రెడ్డి నగర్, జమ్మిగడ్డ,సాయి లోక్ కాలనీ, సాయి నగర్, జై జవాన్ నగర్ తదితర కాలనీలలో కరపత్రాలను ఓటర్లకు ఇస్తూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశ సంపదను అక్రమంగా అమ్ముకుంటూ దేశాన్ని దోచుకుంటున్న మోడీ, ప్రతి ప్రాజెక్టు పనులలో కమిషన్లు దండుకొని అందిన కాడికి దోచుకుంటున్న కెసిఆర్, ఇద్దరు తోడుదొంగలకు తోక దొంగగా ఒవైసి మారాడని ఆరోపించారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి మరియు ఆహార భద్రత వంటి రంగాలలో సమాజంలోని అణగారిన వర్గాల హక్కులు దెబ్బతీస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను రాష్ట్రం నుండి తరిమికొట్టాలని అయన కోరారు. ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా, ప్రజల ఆకాంక్షలను సీఎం కెసిఆర్ కాలరాశాడని మండిపడ్డారు. నిరంకుశ కుటుంబ పాలనా కొనసాగిస్తూ నియామకాలు చేపట్టక, నీళ్లు, నిధులు అందించక గత పదిసంవత్సరాలలో తెలంగాణ ప్రజలను నిలువునా బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజాల సమస్యలు, పరిష్కరించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ బలపర్చిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి విజయంలో తోడుగా ఉంటూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టంచేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి, ఉప్పల్ నియోజకవర్గ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.సత్య ప్రసాద్, సీపీఐ కాప్రా పట్టణ కార్యదర్శి లక్ష్మీ నారాయణ, సీపీఐ కార్యకర్తలు ఎల్లేష్,నర్సింహా,మిరియాల సాయిలు, సాయిలు,శకుంతల, సుమశ్రీ, రవళి, మృణాళిని, సంధ్య, లక్ష్మన్, దీప్తి…ఏఐ ఎస్ ఎఫ్ నేతలు మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.