తెలంగాణ వీణ , ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ డివిజన్, విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో, బి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య , వైస్ ప్రసిడెంట్ హమాలి శీను అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి, ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాసరావు , బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ గొల్లురి అంజయ్య తో పాటు పలువురు కార్పొరేటర్లు, కార్మిక శాఖ నాయకులు, ఉద్యమకారులు, హాజరయ్యారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేసీఅర్ నాయకత్వంలో కార్మికులకు ప్రోత్సాహకంగా అత్యధిక జీతాలు ఇస్తూన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ముఖ్య నాయకులు, ఉద్యమకారులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.