Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం కోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి.

ప్రధానిమోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు. టివోలి క్రాస్‌ రోడ్స్‌ నుంచి ప్లాజ్‌ ఎక్స్‌ రోడ్స్‌ను ఊసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు, తివోలి ఎక్స్‌ రోడ్స్, ప్లాజా ఎక్స్‌ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తారు. 
సికింద్రాబాద్‌ సంగీత్‌ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ వైఎంసీఏ వద్ద క్లాక్‌ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు వెళ్లా​​​​​‍లి
బేగంపేట నుంచి సంగీత్‌ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్‌ రోడ్స్‌ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్‌ ఉప్‌కార్, వైఎంసీఏ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ మీదుగా మళ్లిస్తారు
బోయినపల్లి, తాడ్‌బండ్‌ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్‌ బాండ్‌ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
కార్ఖానా, ఏబీఎస్‌ నుంచి ఎస్‌బీహెచ్‌-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్‌ స్వీకార్‌-ఉప్‌కార్‌ వద్ద వైఎంసీఏ, క్లాక్‌ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లిస్తారు.
ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్‌బీహెచ్‌- స్వీకార్‌-ఉప్‌కార్‌ వైపు అనుమతిలేదు. క్లాక్‌ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తారు.
ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ టివోలి వద్ద స్వీకార్‌-ఉప్‌కార్, వైఎంసీఏ లేదా బ్రూక్‌ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలి. 
జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్‌ రాజ్‌భవన్‌ వైపు పంపిస్తారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you