తెలంగాణవీణ, మేడ్చల్ ప్రతినిధి ; బోడుప్పల్ ,పీర్జాది గూడ నగరాల నుండి తోటకూర వజ్రేష్ యాదవ్ నామినేషన్ ధాఖాలకు నాయకులు, అభీమానులు భారీగా తరలి వెళ్ళారు. కీసర చౌరస్తా నుండి కీసర పోలీస్ స్టేషన్ వరకు వేలాదిమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి బారి ర్యాలిగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ వెళ్ళి నామినేషన్ దాఖాలు చేశారు.., ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ ఈ జనసంద్రాన్ని చూసాక నా గెలుపు ఖాయం అయింది అని , మల్లారెడ్డికి ఓటమి తప్పదని అన్నారు. ఈ కార్యక్రమoలో టీపీసీసీ మాజి ఉపాధ్యక్షులు ఉద్ధమర్రి నరసింహా రెడ్డి , మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి , టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ , మరియూ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు , నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాలుగొన్నారు.