Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టు సంఘం నాయకులు

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖరరెడ్డి ఇళ్లస్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత జగన్‌ ప్రభుత్వం మాత్రమే ఇళ్లస్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు.జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్‌ యూనియన్‌ నేతలు జి ఆంజనేయలు, ఎస్‌.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వి వి ఆర్‌ కృష్ణంరాజు, ఫోటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి విజయ్‌ భాస్కర్, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్‌ కె బి జి తిలక్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి దారా గోపి, ది హిందూ ప్రతినిధి అప్పాజీ రెడ్డిమ్, దక్కన్‌ క్రానికల్‌ ప్రతినిధి ఎండీ ఇలియాస్, ఎన్‌టీవీ ప్రతినిధి రెహానా, టీవీ 9 ప్రతినిధి ఎస్‌ హసీనా, సాక్షి టీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ నేమాని భాస్కర్, సాక్షి దినపత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ ఎం రమణమూర్తి పలువురు సీనియర్‌ జర్నలిస్టులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you