తెలంగాణ వీణ,శామీర్‌పేట: విద్యార్థులు చిన్న వయస్సు నుండే బాధ్యతాయుతమైన నాయకులుగా తీర్చిదిద్దాలని, పర్యావరణం, దేశం పట్ల జవాబుదారీతనం వహించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎక్స్ లెన్సియా గ్రూప్ ఆఫ్ కాలేజీస్ నమ్ముతుందని ఎక్స్ లెన్సియా గ్రూప్ ఆఫ్ కాలేజీస్ డైరెక్టర్ మురికి వెంకట్ అభిప్రాయపడ్డారు. తూంకుంట మున్సిపాలిటీ ఉప్పరపల్లిలోని ఎక్స్ లెన్సియా గ్రూప్ ఆఫ్ కాలేజీస్ లో ఈఎంయూఎన్-2023 రెండు రోజుల కార్యక్రమాన్ని శనివారం గ్రేడ్ 11 సీబీఎస్ఈ సెక్రటరీ జనరల్ మాస్టర్ ఆధర్వ్ ఫిరోజ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి దేశం పట్ల జవాబుదారీతనం, పర్యావరణంపై అవగాహన కలిగి ఉండడడంతో పాటు బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగాలని గ్రూప్ ఆఫ్ కాలేజీస్ భావిస్తుందన్నారు. అందులో భాగంగా ఈఎంయూఎన్ – 2023ను ప్రారంభించగా వివిధ ప్రాంతాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొన్నట్లు వివరించారు. ప్రపంచ సమస్యలపై చర్చలు, ఏకోసిస్టమ్ పునరుద్ధరణ ప్రధాన నినాదంగా సరైన ఇతివృత్తంతో ఈ ఈవెంట్ జూనియర్ కళాశాల విభాగంలో నిర్వహించబడే ఒక రకమైన కార్యక్రమం అన్నారు. యూఎన్హెస్ఆర్సీ, యూఎన్డీపీ, యూఎన్ఎస్ఈఏ, ఎఫ్ఎవో, యూఎన్ సీఎస్ డబ్ల్యు, లోక్సబ్, టీఎల్ఎ, ఐపీ, ఇండియన్ వార్, క్యాబినెట్, జీ-20 అనే 10 కమిటీలు ఈ ఎంయూఎన్ ఏర్పాటు చేయగా అనుభవజ్ఞులైన, ఉద్వేగభరితమైన వారి అధ్యక్షతన చర్చలు, తీర్మానాలు ఉంటాయన్నారు. ఇలాంటి ఈవెంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు సహాయం చేయడం, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై యూఎన్ దశాబ్ధంతో వారి సహకారం అందించడం కోసం యూఎన్హెక్ఆర్సీ నుంచి ఈ ఈఎంయూఎన్ అధికారిక ధృవీకరణను కలిగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యూకేషనల్లో దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్ మహేష్, యూఎన్డీపీలో యూత్ సోషల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్లో యూత్ ఎంగేజ్మెంట్ ఆసిస్టెంట్ మోలీశర్మ, స్వాతి సక్సేనా, ప్రధానోపాధ్యాయులు, సీవోవోలు, సెంటర్ హెడ్లు పాల్గొన్నారు