Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

టీమిండియా ఆటగాళ్ల దీపావళి వేడుకలు..

Must read

తెలంగాణ వీణ , జాతీయం :వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you