తెలంగాణ వీణ , హైదరాబాద్ : వైఎస్సార్‌టీపీని బీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని మంత్రి హరీశ్ రావు సోమవారం అన్నారు. గట్టు రామచంద్రరావు, సత్యవతిల ఆధ్వర్యంలో పలువురు నేతలు, వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి హరీశ్ రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైఎస్సార్‌టీపీని విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.