తెలంగాణ వీణ , హైదరాబాద్ : జర్నలిస్ట్ లపై రాళ్ళతో దాడిచేసి చంపుతానని బెదిరిస్తూ వీరంగం సృష్టించిన కరుడుగట్టిన మట్టిమాఫియా బ్రదర్స్ నర్సిహ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపిన జవహర్ నగర్ పోలీసులు. జవహర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామ్ కథనం ప్రకారం విధినిర్వహణలో భాగంగా లక్ష్మీనర్సిహ్మ కాలనీలో సర్వే నంబర్ 691లోని గుట్టను తవ్వి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఫోటోలు తీసినందుకు, నర్సిహ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు విలేకరులను అడ్డగించి అందరూ చూస్తుండగా నానా బూతులు తిడుతూ చేయి చేసుకోవడమే కాక వాళ్లపై రాళ్ళతో దాడిచేసి, ఇక్కడికి విలేకరులు ఎవ్వరు రావొద్దని ఒకవేళ వస్తే వేణును చంపినట్టు చంపుతానని బెదిరిస్తూ చేతిలోని సెల్ ఫోన్లను బలవంతంగా లాక్కొని ఫొటోలను డిలీట్ చేసి అనుచరులతో కలిసి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ సంఘటనపై బాదితుడు శంకరాచారి ఇచ్చిన పిర్యాధుమేరకు విచారణ జరిపి సెక్షన్ 341, 324, 506, 34 ఐపీసి కింద కేసునమోదు చేసామని తెలిపారు. వీరిపై గతంలో ఉన్న నేరచరిత్రను పరిశీలిస్తున్నామని దాదాగిరి గుండాగిరి చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని హెచ్చరించారు.