తెలంగాణ వీణ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారానికి హాజరై కాప్రా డివిజన్ లోని ఇందిరా నగర్ సాయి బాబా నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్రారెంటీలను ప్రజలకి వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశాయని ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొబ్బరి నాగశేషు,పత్తి కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి, అడపు శ్రీనివాస్, తోటకూర శ్రీకాంత్,మురలి, కె.నాగరాజు, జగదీష్,సుమన్, జ్యోతి, లక్ష్మీ, శ్రీధర్,సతీష్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,వినోద్,ప్రశాంత్,నాగరాజు,ఆరిఫ్,శాబుద్ధిన్,శ్యాం, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.