తెలంగాణ వీణ , సినిమా : కె. విశ్వనాథ్ దగ్గర అనేక సినిమాలకు పని చేసిన జయకుమార్, ఆ తరువాత కాలంలో కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ప్రస్తావించారు. “శోభన్ బాబు గారు నన్ను తమ్ముడూ అని పిలిచేవారు. అప్పారావుగారు అని ఆయన పర్సనల్ మేకప్ మేన్ శోభన్ బాబు కోసం ‘రింగ్’తో కూడిన విగ్ సెట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది” అన్నారు.
‘డాక్టర్ బాబు’ సినిమా సమయంలోనే శోభన్ బాబుకి .. జయలలితకు పరిచయమైంది. ఆ సినిమా షూటింగుకి జయలలిత మూడు నాలుగు కార్లలో ఒక యువరాణిలా వచ్చేవారు. ఒక కారులో మేకప్ .. కాస్ట్యూమ్స్, మరో కారులో ఫ్రూట్స్ .. కూలర్ .. ఫ్యాన్, మరో కారులో నుంచి ఆమె దిగేవారు. ఆమెతో మాట్లాడటానికి ముందుగా శోభన్ బాబుగారే ఆసక్తిని చూపేవారు” అని చెప్పారు.