తెలంగాణ వీణ , క్రీడలు : బుధవారం జరగబోయే భారత్ న్యూజిలాండ్ తొలి సెమీస్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ఈ అద్భుత పోరాటాన్ని లైవ్‌లో చూపించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను ప్రదర్శించనున్నారు.
విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశం కూడా ఉచితమేనని తెలుస్తోంది.