తెలంగాణ వీణ , క్రీడలు : టీమిండియా యువ స్టార్ బ్యాట్స్ మెన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ లో కూడా ఇండియా మ్యాచ్లకు క్రమం తప్పకుండా సారా హాజరవుతోంది. గిల్ హాఫ్ సెంచరీ చేసినా, సెంచరీ కొట్టినా చప్పట్లు కొడుతూ ఆనందాన్న వ్యక్తం చేస్తోంది. మరో వైపు తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనేదే ఆ వార్త వీరి వెడ్డింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు చెపుతున్నారు. వరల్డ్ కప్ తర్వాత వీరి పెళ్లి ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఇటు సచిన్ కుటుంబం కానీ, అటు గిల్ ఫ్యామిలీ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.