తెలంగాణ వీణ, కావాడిగూడ : కార్పొరేటర్ రచన శ్రీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ ముఠా గోపాల్ చేసిన అభివృద్ధి ఏమీ కనిపించడం లేదని ఆరోపించారు ముషీరాబాద్ బి.జె.పి ఎం.ఎల్.ఏ అభ్యర్థి పూస రాజు.. ఎన్నికల ప్రచారం లో భాగంగా నియోజకవర్గం లోని ఈశ్వారయ్య బస్తీ, గగన్ మహల్, అరవింద్ నగర్ కాలనీలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.దళితబందు పథకం ద్వారా టీ.ఆర్.ఎస్ నాయకులకే లబ్ది చేకూరిందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అర్హులైన వారికి రాలేదని, ఇండ్లు ఉన్నవారికే మళ్ళీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయని, బస్తీలలో డ్రైనేజి వ్యవస్థ కూడా బాగాలేదని మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రసిడెంట్ మహేందర్ బాబు, కార్పొరేటర్ రచన శ్రీ, శ్రీనివాస్ యాదవ్, రాజకుమార్, శంకర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tweetముఠా గోపాల్ చేసిన అభివృద్ధి పై మండిపడ్డ పూస రాజు.. pic.twitter.com/GKkx9oJB9R
— GS9TV Telugu News (@Gs9tvNews) November 18, 2023