Saturday, December 21, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పుట్టపర్తిలో నేడు రాష్ట్రపతి పర్యటన

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్య­సాయి జిల్లా పుట్ట­పర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివ­రాలను కలెక్టర్‌ అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 3.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు.

మధ్యా­హ్నం 3.05 గంటలకు సాయికుల్వంత్‌ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజే­స్తారు. అనంతరం ప్రసంగిస్తారు. 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానా­శ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you