తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబుతో కలిసి తప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన నువ్వా నీతులు చెప్పేది అంటూ మండిపడ్డారు. ఐదేళ్లలో తన అవసరాల కోసం చంద్రబాబు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో నీ కళ్లకు కనిపించలేదా పవన్ అంటూ ప్రశ్నించారు.
కాగా, పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ మత్య్సకారులకు పంచిన డబ్బుకంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ. పవన్ తన దగ్గర డబ్బులు లేవని చెబుతాడు కానీ ఆయన వద్ద చాలా డబ్బులున్నాయి. పవన్ దగ్గర డబ్బులు లేకుంటే చార్టెడ్ ఫ్లైట్‌లో ఎలా వస్తాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారింది. ఏపీ ప్రజలకు మతిమరుపు చాలా ఎక్కువ అని పవన్ అనుకుంటున్నాడు. మత్స్యకారులకు సీఎం జగన్ ఏమీ చేయడం లేదని పవన్ అంటున్నాడు. సీఎం జగన్ వచ్చాకే 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరయ్యాయి. శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
ప్రజలను ఓటుగా చూసే వ్యక్తులు చంద్రబాబు, పవన్. కాపులను పవన్ ఏనాడైనా మనుషుల్లాగా చూశాడా?. కాపులను పెట్టుబడిగా, ఆస్తిగా, టోకుగా చంద్రబాబుకు బేరం పెట్టడానికే పవన్ చూస్తున్నాడు. ఓట్ల కోసం మాయ చేసి మోసం చేయడానికే చంద్రబాబు, పవన్ వస్తున్నారు. విమానం రానివ్వపోవడానికి మాకేం పని. విమానం దొరకలేదని ఏడవచ్చు కదా.. సిగ్గులేని మాటలు దేనికి. ఇంటెలిజెన్స్ ఆపితే విమానంలో ఎలా వచ్చావ్.. ఎలా వెళ్లావ్ పవన్?. నువ్వు శాస పీల్చేది.. వదిలేది చంద్రబాబు కోసమే. చంద్రబాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే పవన్ పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగానే పవన్ పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా పవన్‌కు తెలియదు’ అంటూ సెటైర్లు వేశారు.