Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఇంటర్ కాలేజి టోర్నమెంట్లో హెచ్ జి పి ఎం విద్యార్థుల ప్రతిభ

Must read

తెలంగాణ వీణ,శామీర్‌పేట: ఇంటర్ కాలేజి టోర్నమెంట్లో శామీర్ పేట్ హెచ్ జి పి ఎం విద్యార్థుల ప్రతిభ చాటారు. ఈ నెల 14,15వ తేదీల్లో హిందు మహా విద్యాలయ కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ ఫిన్సింగ్ క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటిల్లో శామీర్ పేట్ లోని హెచ్ జి పి ఎం బి పిఈడి విద్యార్థులు గంగానాయక్ ప్రథమ స్థానం, జి. మహేష్ తృతీయ స్థానం, ఫైల్ విభాగంలో శిరీష 4వ స్థానం, సాధించినట్లు కళాశాల చైర్మన్ షిరుపుద్దీన్ తెలిపారు. వీరు ఈ నెల 23నుండి 26 వరకు మహారాష్ట్రలో జరుగనున్న యూత్ జోన్ పోటిల్లో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా కళాశాల విద్యార్ధి వరుణ్ సాయి , భార్గవి అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన కబడ్డీ పోటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 19 నుండి 21 వరకు కాకినాడ లో జరిగే సౌత్ జోన్ పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వాసిం ఫిరన్, ప్రిన్సిపాల్ గోపి, సుధ, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you