తెలంగాణ వీణ , హైదరాబాద్ : డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించాల్సిందేనన్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు.
పాల్వాయి స్రవంతి చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్థం కావడం లేదన్నారు. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో ఎందుకు చేరాడు. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్‌లోనే ఉంటాను అని అనేవారు. అలాంటి పాల్వాయి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం